UpmaPesara

మాకు సర్కిల్ అంటే చాలా ఇష్టం!
స్కూల్ లో ఉన్నప్పుడు చేత్తో అర సెంటి మీటర్ సర్కిల్ గీయాలంటే అర గంట పైన పట్టేది. కాని ఇప్పుడు మాత్రం నా చుట్టూ గీసుకొటానికి ఒక నిమిషం సరిపోతుంది. ఇదే నా రేంజ్, ఇంతే ఇంతకంటే ఇంక కష్టం అని చెప్పుకోవటంలో. ఇది చదువు, జాబు, ఫ్రెండ్స్, విజ్ఞానం ఇంకా ఏమన్నా ఉంటే అన్నింటికీ వర్తిస్తుంది. ఇలా సర్కిల్ వేసుకొని దాంట్లోనే లోకం అనుకొనే వాళ్ళు నాలాగా ఇంకా చాలామందుంటారు. మేమంతా మారితే… ?

ఎందుకు మారతామండి? అసలు మా గురువే మాకివన్ని నేర్పించారు. ఎవరైనా గురువు మాట దాటోచ్చా? ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదూ, అదేనండి ఆంజనేయుడు. పాపం ఆయన పక్కన వాళ్ళు ఎవరైనా పొగిడితే ఓకే, లేపోతే అసలు ఆ వృత్తంలో నుండి బయటకు రాడు. సర్కిల్ గీసుకోటంలో ఆయన తర్వాతే కదా ఎవరైనా. దేవుడికే ఈ తిప్పలు తప్పలేదు మేమెంత. కాని అప్పట్లో అంటే ఆ పక్కన పొగిడే వాళ్లకి టైం ఉండేది. ఇప్పుడేమో వాళ్ళని వాళ్ళు చూసుకోటానికే సరిపోట్లేదు. ఇది భలే ఉంది కదా గీసుకుంది మేము కాని దాన్ని చెరపటానికి మాత్రం పక్కన్నుండి హెల్ప్ కావాలి.

మారదామా? కనీసం ఆలోచిద్దామా? అసలు ఈ ప్రాబ్లం ఎందుకొస్తుంది? నాకు తెలీదు కాని కొద్దిసేపు ఆలోచిస్తే ఇందుకేమో అనిపించింది.

1. లైఫ్ సెక్యూర్ గా ఉండాలి సేఫ్ గా ఆడాలి అనుకోవటం

2. పక్కన గొప్ప వ్యక్తుల్ని చూసి అమ్మో మనవల్ల కాదు అనుకోటం (బేసిక్ గా కంపేర్ చేసుకోటం వల్ల)

3. సొంత నిర్ణయం కంటే ఇతరుల నిర్ణయం మీద ఆధారపడ్డప్పుడు

ఇలా ఇంకా చాలా గుడ్ హబిట్స్ వల్ల ఇలా సర్కిల్ గీసుకోవటం జరుగుతుందండి. మరేం చేస్తే ఇది పోతుంది. ఏమో మీరే ఆలోచించుకోండి. ఇది కూడా నేను చెప్తే మళ్ళి అక్కడ ఇంకో సర్కిల్ ఏర్పడుతుంది. అసలు చెప్పేదేంటంటే మనని మనం తెలసుకుందాం అని. లేదు ఇలానే బావుంది అనుకుంటే కనీసం ఆ డయా మీటర్ ని ఇంకో కిలో మీటర్ పెంచుకోండి. బావుంటే కంటిన్యు అవ్వొచ్చు. ఆహా అది కూడా వద్దు అనుకుంటే Continue playing safe and secure  దేనికైనా నా నుండి All the Best!

కలం టచ్ చేస్తే….
ఎందరో  సాహిత్యవేత్తలు,  అందరికి  వందనాలు.   కలం  బలాన్ని  ఇవ్వగలదు,  కళ్ళల్లో  జలాన్ని  ఇవ్వగలదు.  నన్ను  టచ్  చేసి  చుట్టూ  తిప్పుకుంటున్న  కొన్ని వాక్యాలు….

“నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే” – ఓ కొడుకు తన తల్లి గురించి

“ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే  వేళలో” – మగాళ్ళకి  ఓ చురక

“కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి అలలతో పోటి పడి చేరాలి కలల కడలి” – ఉత్తేజాన్ని  కలిగిస్తూ

“చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం” – ఓ ప్రేమికుడి వేదన

“ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా” – స్నేహం గొప్పతనం చెబ్తూ

“గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు” – విరహం

“వరమనుకో దొరికిన జీవితం రుతువులు గీసే రంగుల ఓ చిత్రం”

“పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే” – కష్టం నుండి సుఖం

“లోలకం లాగా ఊగుతూ సాగే మీ నడుములన్ని స్క్రూగేజ్ తోనే కొలిచేయలేమా” – టీజింగ్

“తప్పదని నిను తప్పుకొని వెతకాలి కొత్తదారి”

“దూరాన్ని దూరం దూరం పో పొమ్మంటు చిత్రంగా చేతులు కలిపారే”

“అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు”

“నే మనసు పడితే ఏ కళలనైనా ఈ చిటికే కొడుతూ నే పిలువనా” – గర్వమా? నమ్మకమా?

“కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే”

అక్షరాస్యత నిర్వచనం మార్చాలి. ఏ పుస్తకం లో ??
ప్రస్తుత  మన  నిర్వచనం  ప్రకారం తన పేరుని తాను రాసుకోగలిగి,  దాన్నే  చదవగలిగితే  సదరు  వ్యక్తిని  అక్షరాస్యుడు  అని  పిలవొచ్చు.  ఈ ప్రకారం లెక్కలు వేసుకుంటే  మన  దేశ  అక్షరాస్యత  శాతం దాదాపు 70% చేరి మంచి వృద్ధి రేటుతో ముందుకు సాగుతుంది.  ఈ మాత్రం విద్య ఎక్కడ ఉపయోగపడుతుందో  తెలుసా?  భూమి  అమ్మకాలు,  కొనుగోలు  రిజిస్త్రేషన్  దగ్గర,  ప్రామ్సరి  నోటుల  మీద,  బ్యాంకు  లోన్  అప్లికేషను  మీద…..  ఇంకా  ఇలాంటివి  ఎన్నెన్నో!   ఒకసారి  మీకు,  నాకు  తెలిసిన  వాళ్ళలో  ఎంత  మంది  ఈ కేటగిరిలోకి వస్తారో లెక్కేయ్యండి.

నా ఉద్దేశం వాళ్ళని వేలెత్తి  చూపటం  కాదు  కాని  ఆ నిర్వచనం  వాళ్ళని  అక్కడి  వరకే  నేర్చుకునేలా  ఫోర్స్  చేసిందని.  కాలంతో  పాటూ  చాలా  మారుతున్నాయిగాని  కాని  ఈ నిర్వచనాలు  మాత్రం  అలానే  ఉంటున్నాయి.  ఇదే  నా  బాధ.  ఇవన్ని  అప్పుడు  కల్చర్,  పరిస్థితులు,  “రాజకీయాల”  కి  తగ్గట్టుగా  రాసారేమో!  కాని  ఇప్పుడు  పరిస్థితి  వేరు  కదా.  ఉదాహరణకి  అప్పట్లో  రాజకీయాలు  అనే  పదాన్ని  దానికే  ఉపయోగించేవాళ్ళు  కాని  ఇప్పుడు  ఎవరు  ఎవర్నైనా  మోసం  చేసుకుంటే  “ఏరా  రాజకీయాలు  చేస్తున్నావా?”  అంటారు.  దీన్ని  బట్టి  మీకు  అర్ధమయ్యే  ఉంటది.

చాలా  సమస్యలకు  కారణం  చదువు  లేకపోవటమే.  మన  అక్షరాస్యుల  చదువు  సమస్యల్ని  పరిష్కరించటానికి  ఏమాత్రం  సరిపోదు.  నాయకులు  చెప్పే  మాటలు  గుడ్డిగా  నమ్మేస్తారు  అది  మంచైనా  చెడైనా!  తెలంగాణా  వెనకపడటానికి  ఒక  కారణం  కూడా  ఇదే.  ఇంత  ఎందుకండి  ఓట్లు  వేసేటప్పుడు  మా  ……. గుర్తుకే  మీ  ఓటు  వెయ్యండి  అంటారు  కాని  మా  పార్టీకే మీ ఓటు వెయ్యండి  అని  ఒక్క  నాయకుడు  అనడు.  ఎందుకు?  పేరు  తప్ప  ఏమి  చదవటం  రాని  వాళ్ళు  చాలా  మంది  ఉన్నారు  అని  వాళ్లకి  తెలుసు.  అందుకే  గుర్తు  చూపించి  గుద్దమంటారు.  బాలట్  పేపర్లో  పార్టీ  పేరు  & గుర్తు  బదులు  కేవలం  పేరు  మాత్రమే  ఉంచి  ఎలెక్షన్స్  జరిగిన  రోజు  మనం  నిజంగా  డెవలప్  అవుతున్నాం  అనుకుందాం.

ఇంతకీ  ఏ   పుస్తకం  లో  ఈ నిర్వచనం  మార్చాలి  ? ప్లీజ్  ఎవరైనా  చెప్పరూ…….

స్టాక్ మార్కెట్, ఇచ్చేది షాకులేనా ? సొమ్ములివ్వదా?
ఓ పిచ్చెదవ: “నాన్నా, ఫ్రెండ్ చెప్తే ఒక వంద షేర్లు కొన్నాను 2000  పెట్టి”

క్రమశిక్షణ నేర్పే తండ్రి: “సంపాదించేది అక్కడ తగలెట్టటానికా? చేసింది చాలు నాకు పంపు నేను ఎల్ ఐ సి కడతా”

ఇది జనరల్ గా మన సౌత్ ఇండియా ఇళ్ళలో పరిస్తితి అతిముఖ్యంగా ఆంధ్రా (ప్రదేశ్) లో! ఎవరో కౌన్ కిస్కా కక్కుర్తిగా డబ్బులు పెట్టి దొబ్బిచుకున్నాడని మనని అసలు దాని గురించే తెలియకుండా పెంచుతారు.  పేకాట ఆడినా ఒప్పుకుంటారేమోగాని షేర్స్ అంటే కయ్యిమంటారు. ఇకపోతే ఇన్సురెన్సులు, ఉన్నప్పుడు అవసరమైనప్పుడు ఉపయోగపడవు కాని లైఫుని కవర్ చేస్తాయి. అలాంటివి ఎన్ని కావాలి ఒకటి సరిపోదా? ఇంకోసారి పొతే(తిరిగిరావు)  చిట్స్! గాలిలో దీపం పెట్టి గుండె మీద చేతులు పెట్టుకోవాలి. అయినా సరే ఇవి రెండే మన ఇళ్ళల్లో ఇప్పటికి ఇంకా సేవింగ్స్ కి మార్గాలు.

కొంతమందికి భయముండదు కాని స్టాక్ మార్కెట్ గురించి అసలు తెలిసి ఉండదు ఎందుకంటే మనం జర్మనీ లో హిట్లర్ ఏం చేసేవాడో చదువుకున్నాము గాని సెన్సెక్స్ అంటే చదవలేదుగా! రోజు న్యూస్ లో చెప్తారు “కుప్ప కూలిన మార్కెట్. నష్టాల బాటలో ఐ టి రంగం” అని. అది తప్పితే ఏరోజైనా అసలేంటి అని బేసిక్స్ కూడా చెప్పినట్టు నేనైతే చూడలేదు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మార్కెట్ టైమింగ్స్ ఆఫీసు టైమింగ్స్ ఒకటే ఉండటం + చాలా కంపెనీలు ఆ టైమింగ్స్ లో ట్రేడింగ్ ని  రెస్త్రిక్ట్ చెయ్యటం.

నాకు తెల్సి (a + b)2 ఫార్ములా కంటే కష్టమేమి కాదు స్టాక్స్ గురించి తెల్సుకోవటం. స్టాక్స్, ఐ పి ఓస్, ముచువల్ ఫండ్స్! అంతే ఈ మూడు తెల్సుకుంటే సగం వచ్చినట్టే. నష్టాలు నష్టాలు అంటామేగాని లాంగ్ టర్మ్లో (కనీసం 6 నెలలు) మంచి రిజల్ట్స్ చూడొచ్చు. SEBI కూడా మనలో మార్పు కోసం ప్రత్యేక స్కూల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇకపోతే హెల్ప్ కోసం బోలెడు వెబ్సైట్స్, అడ్వైజర్స్ & బ్రోకర్స్ ఉన్నారు.

ఫైనల్ గా చెప్పేదేంటంటే ఒక పిల్లోడు నడవబోతే కిందపడ్డాడని ఇంక నడవనీకుండా చెయ్యము కదా, ఇది అలానే ఆలోచిద్దాం. ఒకసారి కాలితే రెండోసారి జాగ్రత్త పెరగాలే గాని చెయ్యి వెనక్కి తీసుకోకూడదు.

హ్యాపీ ట్రేడింగ్!

3 ఫైట్లు + 6 పాటలు = 1 ఫ్లాపు!
“రే మనోడి సినిమా రిలీజ్ అయింది కదా ఎట్లుంది ?”

“సూపర్ రా డాన్సు అరుపు, ఫైట్లు కేక పక్కా 100 డేస్”

“చాలా బాగుందిరా అన్నీ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి చూడు”

“బాగుంది కాని సెకండ్ హాఫ్ కొంచెం వీక్ అయిందిరా”

“పర్లేదు రా ఓసారి చూడొచ్చు”

“డబ్బులు బొక్కరా డౌన్లోడ్ చేసుకొని చూడు”

“అదా ఇప్పుడు ఏ థియేటర్లో ఉంది?”

రిలీజ్ అయిన 2 వీక్స్ లో ఇది నేటి సినిమా పరిస్థితి!

టెక్నాలజి వోల్వోలో పరిగెడుతుంటే మన తెలుగు సినిమా ఇంకా ఎర్రబస్సునే నమ్ముకొని ఉంది. గత 4 ఏళ్ళలో ఒక 10 హిట్ సినిమా పేర్లు చెప్పమని అడిగితే ఒక గంట వెతికి చెప్పాలి, మళ్ళీ సరిగ్గా చూస్తే అందులో చివరి 5 యావరేజ్ ఆడి ఉంటాయి!

ఒకప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే వినోదం కోసం సినిమాను ఎంచుకునేవాళ్ళు కాని ఇప్పుడు వేరే ఆప్సన్స్ వెతుక్కోవాల్సిన స్టేజ్ వచ్చింది. దీనికి కారణం ఎవరు? నిర్మాతలా, డైరెక్టర్సా, యాక్టర్సా, ఫాన్సా లేక జనమా? ఇదే ప్రశ్న ఒక ఇండస్ట్రీ వ్యక్తిని అడిగితే సమాధానం ఇలా ఉంటుంది “మేము కొత్తగా తియ్యాలనుకుంటామండి కాని జనం దాన్ని రిసీవ్ చేసుకోరు, చూడరు. అందుకే ఇంకా మేము 3 ఫైట్లు 6 పాటల్నే నమ్ముకున్నాము….” మరి అయినా ఎందుకు సినిమాహాళ్ళు నిండట్లేదు అని అడిగితే వాళ్ళు జవాబు కోసం గూగుల్లో వెతుక్కోవాలి. జనం మారారు అని నా గట్టి నమ్మకం ఎందుకంటే మారకపోతే ఈరోజు సినిమా పరిస్థితి ఇంకోలా ఉండేది. “మీకేం బాబు ఏమైనా చెప్తారు 2.30 గంటల సినిమాకి కథలు దొరకట్లేదు. నువ్విస్తావా కథ?” అని ఓ డైరెక్టరు గారు నిట్టూరుస్తారు. 2.30 గంటలు లేకపోతే మీ కథతో ఎంతొస్తే అంతే తియ్యండి అది ఓ గంటయినా చూడటానికి మేము రెడీగానే ఉన్నాము.

చెప్పటం చాలా వీజి అని నాకు కూడ తెలుసు కాని చెయ్యటం మా పని కాదు కదా! దానికి స్పెషలిస్ట్లు ఉన్నారు అది మీరే! ఇకనైనా సినిమా తీసేముందు మా సీట్లో కూర్చొని ఆలోచించి తీస్తారని ఆశిస్తు సెలవు – ఓ సగటు సినీ అభిమాని + బాధితుడు!