28 Jan 2010

స్టాక్ మార్కెట్, ఇచ్చేది షాకులేనా ? సొమ్ములివ్వదా?

Srikanth | Category: Rocket Science

పిచ్చెదవ: “నాన్నా, ఫ్రెండ్ చెప్తే ఒక వంద షేర్లు కొన్నాను 2000 పెట్టి”
క్రమశిక్షణ నేర్పే తండ్రి: “సంపాదించేది అక్కడ తగలెట్టటానికా? చేసింది చాలు నాకు పంపు నేను ఎల్ ఐ సి కడతా”

ఇది జనరల్ గా మన సౌత్ ఇండియా ఇళ్ళలో పరిస్తితి అతిముఖ్యంగా ఆంధ్రా (ప్రదేశ్) లో! ఎవరో కౌన్ కిస్కా కక్కుర్తిగా డబ్బులు పెట్టి దొబ్బిచుకున్నాడని మనని అసలు దాని గురించే తెలియకుండా పెంచుతారు. పేకాట ఆడినా ఒప్పుకుంటారేమోగాని షేర్స్ అంటే కయ్యిమంటారు. ఇకపోతే ఇన్సురెన్సులు, ఉన్నప్పుడు అవసరమైనప్పుడు ఉపయోగపడవు కాని లైఫుని కవర్ చేస్తాయి. అలాంటివి ఎన్ని కావాలి ఒకటి సరిపోదా? ఇంకోసారి పొతే(తిరిగిరావు) చిట్స్! గాలిలో దీపం పెట్టి గుండె మీద చేతులు పెట్టుకోవాలి. అయినా సరే ఇవి రెండే మన ఇళ్ళల్లో ఇప్పటికి ఇంకా సేవింగ్స్ కి మార్గాలు.

కొంతమందికి భయముండదు కాని స్టాక్ మార్కెట్ గురించి అసలు తెలిసి ఉండదు ఎందుకంటే మనం జర్మనీ లో హిట్లర్ ఏం చేసేవాడో చదువుకున్నాము గాని సెన్సెక్స్ అంటే చదవలేదుగా! రోజు న్యూస్ లో చెప్తారు “కుప్ప కూలిన మార్కెట్. నష్టాల బాటలో ఐ టి రంగం” అని. అది తప్పితే ఏరోజైనా అసలేంటి అని బేసిక్స్ కూడా చెప్పినట్టు నేనైతే చూడలేదు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మార్కెట్ టైమింగ్స్ ఆఫీసు టైమింగ్స్ ఒకటే ఉండటం + చాలా కంపెనీలు ఆ టైమింగ్స్ లో ట్రేడింగ్ ని  రెస్త్రిక్ట్ చెయ్యటం.

నాకు తెల్సి (a + b)2 ఫార్ములా కంటే కష్టమేమి కాదు స్టాక్స్ గురించి తెల్సుకోవటం. స్టాక్స్, ఐ పి ఓస్, ముచువల్ ఫండ్స్! అంతే ఈ మూడు తెల్సుకుంటే సగం వచ్చినట్టే. నష్టాలు నష్టాలు అంటామేగాని లాంగ్ టర్మ్లో (కనీసం 6 నెలలు) మంచి రిజల్ట్స్ చూడొచ్చు. SEBI కూడా మనలో మార్పు కోసం ప్రత్యేక స్కూల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇకపోతే హెల్ప్ కోసం బోలెడు వెబ్సైట్స్, అడ్వైజర్స్ & బ్రోకర్స్ ఉన్నారు.

ఫైనల్ గా చెప్పేదేంటంటే ఒక పిల్లోడు నడవబోతే కిందపడ్డాడని ఇంక నడవనీకుండా చెయ్యము కదా, ఇది అలానే ఆలోచిద్దాం. ఒకసారి కాలితే రెండోసారి జాగ్రత్త పెరగాలే గాని చెయ్యి వెనక్కి తీసుకోకూడదు.

హ్యాపీ ట్రేడింగ్!

Bookmark and Share

One Response to “స్టాక్ మార్కెట్, ఇచ్చేది షాకులేనా ? సొమ్ములివ్వదా?”

  1. Rakesh Says:

    Your post is excellent. This is happening everywhere in Andhra. Even i am not able to convince my father.

    కొంచెం ప్రత్యేక స్చూల్స్ గురించి చెప్పండి ? ఆ courses గురించి చెప్పండి .

Leave a Reply