31 Jan 2010

అక్షరాస్యత నిర్వచనం మార్చాలి. ఏ పుస్తకం లో ??

Srikanth | Category: Education

ప్రస్తుత మన నిర్వచనం ప్రకారం తన పేరుని తాను రాసుకోగలిగి, దాన్నే చదవగలిగితే సదరు వ్యక్తిని అక్షరాస్యుడు అని పిలవొచ్చు. ఈ ప్రకారం లెక్కలు వేసుకుంటే మన దేశ అక్షరాస్యత శాతం దాదాపు 70% చేరి మంచి వృద్ధి రేటుతో ముందుకు సాగుతుంది. ఈ మాత్రం విద్య ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసా? భూమి అమ్మకాలు, కొనుగోలు రిజిస్త్రేషన్ దగ్గర, ప్రామ్సరి నోటుల మీద, బ్యాంకు లోన్ అప్లికేషను మీద….. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో!  ఒకసారి మీకు, నాకు తెలిసిన వాళ్ళలో ఎంత మంది ఈ కేటగిరిలోకి వస్తారో లెక్కేయ్యండి.

నా ఉద్దేశం వాళ్ళని వేలెత్తి చూపటం కాదు కాని ఆ నిర్వచనం వాళ్ళని అక్కడి వరకే నేర్చుకునేలా ఫోర్స్ చేసిందని. కాలంతో పాటూ చాలా మారుతున్నాయిగాని కాని ఈ నిర్వచనాలు మాత్రం అలానే ఉంటున్నాయి. ఇదే నా బాధ. ఇవన్ని అప్పుడు కల్చర్, పరిస్థితులు, “రాజకీయాల” కి తగ్గట్టుగా రాసారేమో! కాని ఇప్పుడు పరిస్థితి వేరు కదా. ఉదాహరణకి అప్పట్లో రాజకీయాలు అనే పదాన్ని దానికే ఉపయోగించేవాళ్ళు కాని ఇప్పుడు ఎవరు ఎవర్నైనా మోసం చేసుకుంటే “ఏరా రాజకీయాలు చేస్తున్నావా?” అంటారు. దీన్ని బట్టి మీకు అర్ధమయ్యే ఉంటది.

చాలా సమస్యలకు కారణం చదువు లేకపోవటమే. మన అక్షరాస్యుల చదువు సమస్యల్ని పరిష్కరించటానికి ఏమాత్రం సరిపోదు. నాయకులు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మేస్తారు అది మంచైనా చెడైనా! తెలంగాణా వెనకపడటానికి ఒక కారణం కూడా ఇదే. ఇంత ఎందుకండి ఓట్లు వేసేటప్పుడు మా ……. గుర్తుకే మీ ఓటు వెయ్యండి అంటారు కాని మా పార్టీకే మీ ఓటు వెయ్యండి అని ఒక్క నాయకుడు అనడు. ఎందుకు? పేరు తప్ప ఏమి చదవటం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని వాళ్లకి తెలుసు. అందుకే గుర్తు చూపించి గుద్దమంటారు. బాలట్ పేపర్లో పార్టీ పేరు & గుర్తు బదులు కేవలం పేరు మాత్రమే ఉంచి ఎలెక్షన్స్ జరిగిన రోజు మనం నిజంగా డెవలప్ అవుతున్నాం అనుకుందాం.

ఇంతకీ ఏ  పుస్తకం లో ఈ నిర్వచనం మార్చాలి ? ప్లీజ్ ఎవరైనా చెప్పరూ…….

Bookmark and Share

3 Responses to “అక్షరాస్యత నిర్వచనం మార్చాలి. ఏ పుస్తకం లో ??”

  1. నాగప్రసాద్ Says:

    కనీసం వాళ్ళు రాజకీయనాయకులు చెప్పిన ఏదో ఒక గుర్తుకన్నా ఓటు వేస్తారు. కానీ బాగా చదువు కున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు మాత్రం అపార్ట్‌మెంట్‌ల నుంచి కదలరు.

    >>”చాలా సమస్యలకు కారణం చదువు లేకపోవటమే.”

    ఇది తప్పు. చదువు వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం అందరికీ ఉంటుంది. సమస్యలను బట్టి ఉంటుంది ఏదైనా.

  2. Naresh Kamboju Says:

    we will except to happen in short time ….chaala baaga cheeppavvu ra ….keep it up ur toughts …

  3. Satish kumar Dhanekula Says:

    Pusthakam lo enni nirvachanaalu maariste emi labam…Mana rajyangam marcha kaliginda mana e niraksharasyathanu…Manalo nirvachanm maarali.

Leave a Reply