ఎందరో సాహిత్యవేత్తలు, అందరికి వందనాలు. కలం బలాన్ని ఇవ్వగలదు, కళ్ళల్లో జలాన్ని ఇవ్వగలదు. నన్ను టచ్ చేసి చుట్టూ తిప్పుకుంటున్న కొన్ని వాక్యాలు….
“నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే” – ఓ కొడుకు తన తల్లి గురించి
“ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో” – మగాళ్ళకి ఓ చురక
“కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి అలలతో పోటి పడి చేరాలి కలల కడలి” – ఉత్తేజాన్ని కలిగిస్తూ
“చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం” – ఓ ప్రేమికుడి వేదన
“ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా” – స్నేహం గొప్పతనం చెబ్తూ
“గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు” – విరహం
“వరమనుకో దొరికిన జీవితం రుతువులు గీసే రంగుల ఓ చిత్రం”
“పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే” – కష్టం నుండి సుఖం
“లోలకం లాగా ఊగుతూ సాగే మీ నడుములన్ని స్క్రూగేజ్ తోనే కొలిచేయలేమా” – టీజింగ్
“తప్పదని నిను తప్పుకొని వెతకాలి కొత్తదారి”
“దూరాన్ని దూరం దూరం పో పొమ్మంటు చిత్రంగా చేతులు కలిపారే”
“అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు”
“నే మనసు పడితే ఏ కళలనైనా ఈ చిటికే కొడుతూ నే పిలువనా” – గర్వమా? నమ్మకమా?
“కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే”
Leave a Reply