స్కూల్ లో ఉన్నప్పుడు చేత్తో అర సెంటి మీటర్ సర్కిల్ గీయాలంటే అర గంట పైన పట్టేది. కాని ఇప్పుడు మాత్రం నా చుట్టూ గీసుకొటానికి ఒక నిమిషం సరిపోతుంది. ఇదే నా రేంజ్, ఇంతే ఇంతకంటే ఇంక కష్టం అని చెప్పుకోవటంలో. ఇది చదువు, జాబు, ఫ్రెండ్స్, విజ్ఞానం ఇంకా ఏమన్నా ఉంటే అన్నింటికీ వర్తిస్తుంది. ఇలా సర్కిల్ వేసుకొని దాంట్లోనే లోకం అనుకొనే వాళ్ళు నాలాగా ఇంకా చాలామందుంటారు. మేమంతా మారితే… ?
ఎందుకు మారతామండి? అసలు మా గురువే మాకివన్ని నేర్పించారు. ఎవరైనా గురువు మాట దాటోచ్చా? ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదూ, అదేనండి ఆంజనేయుడు. పాపం ఆయన పక్కన వాళ్ళు ఎవరైనా పొగిడితే ఓకే, లేపోతే అసలు ఆ వృత్తంలో నుండి బయటకు రాడు. సర్కిల్ గీసుకోటంలో ఆయన తర్వాతే కదా ఎవరైనా. దేవుడికే ఈ తిప్పలు తప్పలేదు మేమెంత. కాని అప్పట్లో అంటే ఆ పక్కన పొగిడే వాళ్లకి టైం ఉండేది. ఇప్పుడేమో వాళ్ళని వాళ్ళు చూసుకోటానికే సరిపోట్లేదు. ఇది భలే ఉంది కదా గీసుకుంది మేము కాని దాన్ని చెరపటానికి మాత్రం పక్కన్నుండి హెల్ప్ కావాలి.
మారదామా? కనీసం ఆలోచిద్దామా? అసలు ఈ ప్రాబ్లం ఎందుకొస్తుంది? నాకు తెలీదు కాని కొద్దిసేపు ఆలోచిస్తే ఇందుకేమో అనిపించింది.
1. లైఫ్ సెక్యూర్ గా ఉండాలి సేఫ్ గా ఆడాలి అనుకోవటం
2. పక్కన గొప్ప వ్యక్తుల్ని చూసి అమ్మో మనవల్ల కాదు అనుకోటం (బేసిక్ గా కంపేర్ చేసుకోటం వల్ల)
3. సొంత నిర్ణయం కంటే ఇతరుల నిర్ణయం మీద ఆధారపడ్డప్పుడు
ఇలా ఇంకా చాలా గుడ్ హబిట్స్ వల్ల ఇలా సర్కిల్ గీసుకోవటం జరుగుతుందండి. మరేం చేస్తే ఇది పోతుంది. ఏమో మీరే ఆలోచించుకోండి. ఇది కూడా నేను చెప్తే మళ్ళి అక్కడ ఇంకో సర్కిల్ ఏర్పడుతుంది. అసలు చెప్పేదేంటంటే మనని మనం తెలసుకుందాం అని. లేదు ఇలానే బావుంది అనుకుంటే కనీసం ఆ డయా మీటర్ ని ఇంకో కిలో మీటర్ పెంచుకోండి. బావుంటే కంటిన్యు అవ్వొచ్చు. ఆహా అది కూడా వద్దు అనుకుంటే Continue playing safe and secure దేనికైనా నా నుండి All the Best!
April 24th, 2010 at 8:20 pm
Very interesting!
April 25th, 2010 at 3:46 pm
Actual ga manam mana circle ni kuda geechukovatle….All ready unna circle lone adjust ayipothunnamemo ani naa abhipraayam friend.