26 Jan 2010

3 ఫైట్లు + 6 పాటలు = 1 ఫ్లాపు!

Srikanth | Category: Cinema

“రే మనోడి సినిమా రిలీజ్ అయింది కదా ఎట్లుంది ?”

“సూపర్ రా డాన్సు అరుపు, ఫైట్లు కేక పక్కా 100 డేస్”
“చాలా బాగుందిరా అన్నీ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి చూడు”
“బాగుంది కాని సెకండ్ హాఫ్ కొంచెం వీక్ అయిందిరా”
“పర్లేదు రా ఓసారి చూడొచ్చు”
“డబ్బులు బొక్కరా డౌన్లోడ్ చేసుకొని చూడు”
“అదా ఇప్పుడు ఏ థియేటర్లో ఉంది?”

రిలీజ్ అయిన 2 వీక్స్ లో ఇది నేటి సినిమా పరిస్థితి!
టెక్నాలజి వోల్వోలో పరిగెడుతుంటే మన తెలుగు సినిమా ఇంకా ఎర్రబస్సునే నమ్ముకొని ఉంది. గత 4 ఏళ్ళలో ఒక 10 హిట్ సినిమా పేర్లు చెప్పమని అడిగితే ఒక గంట వెతికి చెప్పాలి, మళ్ళీ సరిగ్గా చూస్తే అందులో చివరి 5 యావరేజ్ ఆడి ఉంటాయి!

ఒకప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే వినోదం కోసం సినిమాను ఎంచుకునేవాళ్ళు కాని ఇప్పుడు వేరే ఆప్సన్స్ వెతుక్కోవాల్సిన స్టేజ్ వచ్చింది. దీనికి కారణం ఎవరు? నిర్మాతలా, డైరెక్టర్సా, యాక్టర్సా, ఫాన్సా లేక జనమా? ఇదే ప్రశ్న ఒక ఇండస్ట్రీ వ్యక్తిని అడిగితే సమాధానం ఇలా ఉంటుంది “మేము కొత్తగా తియ్యాలనుకుంటామండి కాని జనం దాన్ని రిసీవ్ చేసుకోరు, చూడరు. అందుకే ఇంకా మేము 3 ఫైట్లు 6 పాటల్నే నమ్ముకున్నాము….” మరి అయినా ఎందుకు సినిమాహాళ్ళు నిండట్లేదు అని అడిగితే వాళ్ళు జవాబు కోసం గూగుల్లో వెతుక్కోవాలి. జనం మారారు అని నా గట్టి నమ్మకం ఎందుకంటే మారకపోతే ఈరోజు సినిమా పరిస్థితి ఇంకోలా ఉండేది. “మీకేం బాబు ఏమైనా చెప్తారు 2.30 గంటల సినిమాకి కథలు దొరకట్లేదు. నువ్విస్తావా కథ?” అని ఓ డైరెక్టరు గారు నిట్టూరుస్తారు. 2.30 గంటలు లేకపోతే మీ కథతో ఎంతొస్తే అంతే తియ్యండి అది ఓ గంటయినా చూడటానికి మేము రెడీగానే ఉన్నాము.

చెప్పటం చాలా వీజి అని నాకు కూడ తెలుసు కాని చెయ్యటం మా పని కాదు కదా! దానికి స్పెషలిస్ట్లు ఉన్నారు అది మీరే! ఇకనైనా సినిమా తీసేముందు మా సీట్లో కూర్చొని ఆలోచించి తీస్తారని ఆశిస్తు సెలవు – ఓ సగటు సినీ అభిమాని + బాధితుడు!

Bookmark and Share

Tags: ,

3 Responses to “3 ఫైట్లు + 6 పాటలు = 1 ఫ్లాపు!”

  1. Nagarjuna Reddy Says:

    Very true, been a long time since we had gud telugu movie, what was the last movie i liked in Telugu?

  2. Naresh Kamboju Says:

    Nijamey ra sri, chaala rooju indhi ra oka manchi telugu cenima chuusi … avunu ley … evvarini tappu padaam …

  3. sai reddy Says:

    well said mama. First lo aa starting bagundi. Nijanga telugu cinema paristhithi anthe…..

Leave a Reply